Skip Navigation Links
హోం పేజీ
ప్రవచనములు
స్తోత్రములు
వీడియోలు
ఫోటోలు
క్యాలెండర్
**CDs/DVDs**
eStore
సంప్రదించండి
ముఖ్య గమనిక
English
Skip Navigation Linksమొదటి పేజీ » **CDs/DVDs**
Sri Guru Vaani
శ్రీ గురుభ్యోనమః

అందరికీ నమస్కారం!

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి గురించి తెలియని వారు గానీ , వారి ప్రవచన అమృత ధార గ్రోలని తెలుగు వారు గానీ ఇప్పుడు లేరంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదనే చెప్పాలి. పూజ్య గురువులు తమ అమూల్యమైన సమయాన్ని, వాక్కును, జ్ఞానాన్ని ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, వాటిని మన అందరికోసం వెచ్చించి ఎన్నో ఏళ్ళుగా ఆంధ్ర దేశం నలుమూలలే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలలో ఎన్నో ప్రవచనాలు చేశారు. దేశ విదేశాల్లో ఎందరినో తమ వాక్కు చేత ఉద్దరించి శిశ్టాచార పరుల్ని చేశారు. వారు ఈ ప్రవచనముల ద్వారా ఎటువంటి లౌకిక ప్రయోజనం ఆశించకుండా, వారు చెప్పే ప్రవచనం ఆ భగవత్సేవ అని చాటి చెప్తూ, అవసరమైతే వారే తిరిగి ఖర్చు పెట్టి ప్రవచనం చెప్పడం తప్ప ఎన్నడూ ఈ ప్రవచనాల ద్వారా ఒక్క రూపాయి ఆశించలేదు, ఆర్జించలేదు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనములు కొందరే కాక అందరూ వినాలన్న ఉద్దేశ్యంతో, అందరికీ ఉచితంగా అందించాలన్న ఉద్దేశ్యంతో కొందరు ఔత్సాహికులైన గురువుగారి శిష్యులు కలిసి అంతర్జాలంలో (ఇంటర్నెట్) గురువుగారి ప్రవచనాలను అందుబాటులోకి తెచ్చి ఉచితంగా వినేందుకు, చూసేందుకు శ్రీ చాగంటి.నెట్ అనే వెబ్‍సైట్‍ను రూపొందించారు. ఆసక్తి కల ఎందరో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని గురువుగారి దృశ్య రూప, మరియు శ్రవణ ప్రవచనాలను ఆ సైటు నుండి దిగుమతి చేసుకుంటున్నారు.

గత కొంత కాలంగా పూజ్య గురువులు శ్రీ చాగంటి వారి ప్రవచనములకు సంబంధించిన C.D /D.V.D లు ఆడియో ఫార్మాటులోకానీ వీడియో ఫార్మాటులోకాని అందుబాటులో లేవు. అంతర్జాలంలో ఉన్నా అది అందరికీ అన్ని వేళలా ఉపయోగించుకునే సౌకర్యం లేదని చాలా మంది పూజ్య గురువుల శిష్యులు, అభిమానులు తమ అసౌకర్యాన్ని వెలిబుచ్చారు. పూజ్య గురువులవారి ప్రవచనములకు సంబంధించిన C.D /D.V.D లు ఆడియో /ఫార్మాటులో అందించడానికి కొంత మంది గురువుగారి అభిమానులు శిష్యులు గురువుగారి అనుమతి పొంది శ్రీ గురు వాణి సంఘము [Sree Guru Vaani Soceity (regd)] ఏర్పాటు చేసి DVD/CD లను తయారుచేసి కావలసిన వారికి అందించడానికి ముందుకు వచ్చారు. గురువుగారి అనుమతితో ఇప్పుడు శ్రీ గురువాణి సంఘము వారు వారి ఆధ్వర్యములో గురువుగారి ప్రవచనాలను ప్రత్యేకంగా అమర్చిన D.V.D ఫార్మాటులో విడుదలచేసారు.

శ్రీ గురువాణి సంఘము

పూజ్య గురువులకి గురువుగారికి తమ ప్రవచనాలను అందరికీ C.D/D.V.D ల రూపంలోనో , అంతర్జాలంలో ఉంచో, లేదాఇతర సాంకేతిక పరిజ్ఙానంతోనో అందించాలనో అమ్మాలనో కోరిక లేవు. కానీ ఇంతటి అమూల్యమైన ఆధ్యాత్మిక ప్రవచన సంపద అందరికీ అందాలి, ముందు తరాలకి కూడా ఈ ప్రవచనాలు అందుతూ మన సనాతన ధర్మ వైభవం గురించిన విషయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్న ఉద్దేశ్యంతో కొంతమంది గురువుగారి శిష్యులు కలిసి srichaganti.net ను మరి కొంత మంది కలిసి శ్రీ గురువాణి సంఘము ను ఏర్పాటు చేసి దీని ద్వారా గురువుగారి ప్రవచనాలను నందన నామ సంవత్సరాది నుండీ CD/DVDల రూపంలో పంపిణీ చేస్తున్నారు. ఈ సంఘము పూజ్య గురువుల ఆశీస్సులతో, ఎటువంటి లాభాపేక్ష లేకుండా, జనులందరికీ ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా, ఇతర వైదిక సాంఘిక కార్యక్రమాల ద్వారా గురువుగారి ఆశయం, అనుజ్ఙ మేరకు సేవ చేయడానికి ఏర్పడిన సంస్థ.

ఈ సంస్థ యొక్క ముఖ్య లక్ష్యాలు


  • గురువుగారి అన్ని ప్రవచనములను Audio/Vedio ల రూపంలో రికార్డు చేయడం
  • రికార్డు చేసిన అన్ని ప్రవచనాలను CD/DVD ఇత్యాదుల రూపంలో ప్రజలందరికీ సంఘం నిర్ణయించిన (వీలైనంత తక్కువ) ధరకే అందించడం
  • ఒక వేళ CD/DVD మరియు ఇతరముల పంపిణీ ద్వారా మిగిలిన కొద్ది సొమ్ము ఏదైనా ఉంటే దానిని ఈ క్రింది విధంగా ఖర్చు చేయటం
    • మన సంస్కృతి సంప్రదాయాలు, సనాతన ధర్మము, వేదము ఇత్యాదులను ప్రోత్సహించే విధంగా కావలసిన ఆర్థిక పరిపుష్ఠిని అందించడం.
    • సనాతన ధర్మమునకు సంబంధించి, ఆధ్యాత్మికమైన, వైదికమైన పురాతన లేదా ఇతర పుస్తకములను ముద్రించడం/పునర్ముద్రించడం (ఎలక్ట్రానిక్ పుస్తకాలు మరియు పేపరు పుస్తకాలు)
  • ఈ సంఘ కార్యక్రమాలు కేవలం సనాతన ధర్మము, ఆధ్యాత్మిక వైదిక పరమైన సాంఘిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితమవుతుంది
  • ఈ సంస్థ యొక్క ఏ కార్యక్రమమైనా వ్యాపార ధోరణి లాభాపేక్ష లేకుండానే రచింపబడతాయి, సంఘం యొక్క లక్ష్యాలు నెరవేర్చడంలో ఏదేని కార్యక్రమ నిర్వహణలో ఖర్చుకన్నా రాబడి అధికమైతే అది అనుషంగికమే కాని లాభాపేక్ష వలన కాదు

సంఘముకు వచ్చిన ప్రతిపైసా కూడా కేవలం సంఘము యొక్క ముఖ్య లక్ష్యాలను నెరవేర్చడానికే ఖర్చు పెట్టబడుతుంది తప్ప ఏ ఇతర అన్య విషయాలకి తావులేదు.

ముఖ్య గమనిక: అంతర్జాలంలో srichaganti.net లో ఉన్న ప్రవచనములు ఉచితముగానే డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉన్నది. అందరూ ఆ వసతిని ఉపయోగించుకొనమనవి. ఎవరికైనా D.V.D/CD ఫార్మాట్లలో కావాలంటే ప్రస్తుతం ఈ క్రింది వారిని మాత్రమే సంప్రదించాలి.

ఒక D.V.D బాక్సులో రెండు డిస్క్ లు కలిపి తయారీ ఖర్చుకే అందరికీ అందిస్తున్నారు. పూర్తి వివరాలకు, వీని గురించి ఏ ఇతర విషయమైనా ఈ క్రిందవారిని సంప్రదించండి

List of Audio DVD’s

Main Area

Sub Area

Contact Name

Contact Number

Ananthapur

Subhash Road

Sri A.Sudheer

9440209607

Chittoor

Konga Reddy Pally

Sri V.Narendra Babu

9849057949

Guntur

Kothapet

Sri K.Suryam

9848996727

Hyderabad

Ramakrishna Puram

Sri D.Ganesh Kumar

9949660465

Shamshabad

Sri V.V.Ramalingeswara Rao

9494966169

Kakinada

Madhura Nagar

Sri V.Suryanarayana Murthy

9866297990

Kurnool

Srisailam

Sri D.Ramesh

8341226058

Nellore

Pogathota

Sri S.V.S.Raghavendra Rao

0861- 2324272

Tirupathi

Sivajyothi Nagar

Sri Y.Gnana Prasad

9441555618

Vijayawada

Mahadevapuram Colony / 

Sri.Chavali Prakasa Rao /

9705104747 /

Suryarao pet

Sri Sistla Hanumath Prasad

9949307875

Vizag

Seethammadhaara

Sri Murali Mohan

9246627055


ఇతర చోట్ల ఎక్కడా ఈ C.D / D.V.D లు లభ్యం కావు. కొనేముందు వాటిమీద శ్రీగురువాణి అన్న పేరు, లోగోలు చూసి కొనగలరు. ఇతర చోట్ల ఎక్కడైనా అనధికారికంగా గానీ అధిక ధరలకు గానీ వీటిని అమ్ముతున్నట్లైతే శ్రీ గురువాణి సంఘమునకు తెలియజేయగలరు.


ఇట్లు
శ్రీ గురువాణి సంఘ సభ్యులు

Sree Guru Vaani Society ®  [Reg. No.:  207 / 2012]

H.No. 1-4-348, Plot No.157, 1st Floor, Satya Nagar Colony, New Maruthi Nagar, Kothapet, Hyderabad – 5000035; Contact No. +91 98661 00942, 89784 55777; sreeguruvaani@gmail.com


Regards, 
Sri Guru Vaani team
sreeguruvaani@gmail.com

ఈ వెబ్ సైటులోని వివరములు అన్నియూ శ్రీ చాగంటి.నెట్ కు చెందినవి.   మీ అభిప్రాయం తెలియజేయండి