Skip Navigation Links
హోం పేజీ
ప్రవచనములు
స్తోత్రములు
వీడియోలు
ఫోటోలు
క్యాలెండర్
**CDs/DVDs**
eStore
సంప్రదించండి
ముఖ్య గమనిక
English
Skip Navigation Linksమొదటి పేజీ » హోం పేజీ   

news

-
-

https://www.youtube.com/c/sreeguruvaanichaganti

-

దీపావళి పర్వదిన శుభాక్౦క్షలు

-

గోపూజా విధానము

-

గురు స్తోత్రము & శనైశ్చర స్తోత్రము

-  Aug 04, 2016 - పూజ్య గురువుల మహాభారత దృశ్య ప్రవచనములు విడియో విభాగము నందు చూడగలరు

Jun 03, 2016 - ఇప్పుడు జరుగుతున్న మహాభారత ప్రవచనాన్ని ప్రతిరోజూ E Tv లో ఉదయం 8 గం టలకు ధారావాహికగా వీక్షించగలరు.

Jun 03, 2016 - 'శ్రీమన్మహాభారతం' పై పూజ్య గురువుల ప్రవచనం 23-మే-2016 నుండి నిరవధికంగా.. ( this is without an end date as of now) శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం, భానుగుడి జంక్షన్ దగ్గర, కాకినాడలో


Subscribe To RSS rss
Namaste, we pleased to inform that an updated version of SriChaganti Android app has been released on March 5th, 2018. Kindly update or re-instll the Android app and provide us with any feedback.

Get it from Microsoft
welcome
వాగ్భూషణం భూషణం…

బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వర రావు గారి

ప్రవచన విశేషాల గురించిన ఈ వ్యాసం ఈ వారం ప్రత్యేకం…

శ్రీ గురుభ్యోంనమ:

బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వర రావు గారు.

"ఎన్నో తెలుగు కుటుంబాల్లో గౌరవ సభ్యుడాయన… ఎందుకంటే, వారి లోగిళ్ళలో ఆయన ప్రవచనంతోనే వారికి రోజు" "మొదలౌతుంది. ఆయన గొంతు వినబడుతున్నప్పుడు, వేరే మరే గొంతూ ఆ ఇళ్ళలో వినబడదు. ఇంటి పెద్ద మాట్లా" డుతున్నప్పుడు మిగతా వారంతా మౌనంగా వినడం మన తెలుగిళ్ళ్ల ఆనవాయితీ కద !

"ఇళ్ళ సంగతి కాస్సేపు పక్కన పెడితే, ఎక్కడైనా సరే, వారి ప్రవచన ప్రాంగణాలు భక్త జనంతో కిక్కిరిసి ఉండటానికి గల " కారణమేమిటి? కూర్చోవడానికి కుర్చీ దొరకడం మాట అటుంచి కనీసం నిలబడటానికే స్థలం సరిపోకపోవడమా !!!

"అది కేవలం, భగవత్సంబంధమైన విషయాలకున్న, ఆకట్టుకునే శక్తి… అంటారు శ్రీ చాగంటి వారు."

శృణ్వం తప: అన్నది వేదోక్తి. శ్రధ్ధతో వినడం ఓ తపస్సే నన్నది భగవన్నిర్ణయం.

"ఆధ్యాత్మిక విషయాలు చర్చించబడే చోటు ఏదైనా అత్యంత పవిత్రం. అలాంటి చోట, చోటు ఎంత ఉందన్నదాంతో నిమిత్తం" "లేకుండా, అవసరమైతే ఒంటి కాలిమీద నిలబడైనా వినడం, శారీరిక క్లేశాన్ని ఏ మాత్రం పట్టించుకోకపోవడం సుమారు" రెండు గంటల పాటు సభికులు సాగిస్తున్న తపస్సు కాక మరింకేమౌతుంది ?
"తెలిసి చేసినా, తెలియక చేసినా, వారి శ్రోతలందరూ, అలా తపస్సు చేస్తున్నవారే."

ఆయన తెలుగు వారి గుండెల్లో అంత సమున్నతమైన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం వెనక పెద్ద కధే ఉంది…

"తల్లీ, తండ్రీ, గురువూ, దైవం -- ఇదీ మన ఆర్యులు మనకు నిర్దేశించిన ప్రాధాన్యతా క్రమం.."

"తల్లి తండ్రినీ, ఆ తండ్రి గురువునీ, ఆ సద్గురువు దైవాన్నీ బిడ్డ జీవితం లోకి తీసుకొస్తారు కాబట్టే, వారికి ఆ విలువ."

"దైవ సంకల్పం తో, ఆ అమ్మా, నాన్నా ప్రాణ ప్రతిష్ట చేస్తే, సద్గురువు తన శక్తి చేత ఉత్తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దితే తయారైన" అద్భుత శిల్పం; అస్మద్గురువరేణ్యులు.. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు... ప్రాత:స్మరణీయులు.

"జగద్గురువులు ఆది శంకరాచార్యులవారు, కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర పరమాచార్యుల వారు, రెండు కళ్ళుగా," "శ్రీ రామాయణ, భాగవత, మహా భారతాదులు ఊపిరిగా శ్వాసించే చాగంటి వారి పంచేంద్రియాలూ మాకు పంచ భూతాలుగా" పరిణామం చెందడం వెనక ఉన్న నేపధ్యం అసాధారణం. ఓ కలియుగ అద్భుతం.

అందుకు మూలమైన గురువు గారి ఐహిక సంబంధాలనో సారి పరిశీలిస్తే;

తల్లి: శ్రీమతి చాగంటి సుశీలమ్మ

తన స్మరణ మాత్రాన చాగంటి వారి కళ్లు తడిసేంతగా వారిని ప్రభావితం చేసిన మాతృ మూర్తి శ్రీమతి చాగంటి సుశీలమ్మ.

ఈ ప్రసవం; చిన్న ప్రాణం సంగతి దేవుడెరుగు.. ముందు పెద్ద ప్రాణానికే పెను ప్రమాదం అని వైద్యులు ఎంత హెచ్చరి "స్తున్నా, వంశాంకురాన్ని భర్త చేతుల్లో పెట్టడం ముందు, ప్రాణాలో లెక్కా; అని భావించి, వైద్యుల ఆదేశం మేరకు తనను" "మంచు దిమ్మల మీద పడుకో బెడితే, శరీరం కొంకర్లు పోయే ఆ చల్లదనానికి ఓ పక్క నరకం చూస్తూ, మరో పక్క" "మరణవేదనను మించిన ప్రసవ వేదన అనుభవిస్తూ, సుమారు యాభై ఐదు సంవత్సరాల క్రితం ఆమె ఈ భూమ్మీదకు" "తీసుకొచ్చిన ఆ చిరు ప్రాణి ఈ రోజున కలియుగంలో సాక్షాత్తూ వేదస్వరూపంగా నడయాడుతూ, పండిత, పామర" "విచక్షణ లేకుండా యావత్ ప్రపంచం యొక్క మన్ననలను చూరగొంటున్నారంటే, ఆ తల్లికి అంతకు మించిన నివాళి" ఇంకోటుంటుందా..?
"అందుకే, శ్రీ చాగంటి వారు, ఎన్ని రకాల శారీరిక, మానసిక, ఉద్యోగ సంబంధమైన, ఆర్ధిక పరమైన క్లేశాలు ఎదురైనప్ప" "టికీ, '' ఆ రోజు నా తల్లి అనుభవించిన బాధ కన్నా పెద్దదా'' అని తనను తాను సమాధాన పరుచుకుని తన ప్రవచన " "ప్రస్థానాన్ని, అవిశ్రాంతంగా, కొనసాగిస్తూనే ఉన్నారు."

"ఆ తర్వాత మరో మగ బిడ్డనూ, ఇద్దరు ఆడ పిల్లలనూ కని, సృష్టి కర్తగా తన కర్తవ్యాన్ని పరిపూర్ణంగా నిర్వర్తించిన" అమృత మూర్తి ఆ తల్లి…

మరి స్థితికారుడి సంగతేమిటి ???

తండ్రి : బ్రహ్మశ్రీ చాగంటి సుందర శివ రావు గారు..

"'మా నాన్నగారి నిబధ్ధతతో పోల్చుకుంటే, మేమందరం అణు తుల్యులమే' అన్న శ్రీ చాగంటి వారి వాక్యాలు, వారి స్థాయి" "ని కుదించుకోవడానికి గాక, వారి తండ్రిగారి ఔన్నత్యాన్ని స్పష్టీకరించడానికి మాత్రమే ఉద్దేశించబడినవన్నది సువిదితం."

"జమీందారీ లోని భోగభాగ్యాలు, అవి జారిపోయినప్పుడు మిగిలిన బాధలూ, అన్నిటినీ సమంగా స్వీకరించిన యోగి" పుంగవులు శ్రీ చాగంటి సుందర శివ రావు గారు. నిష్కళంక భక్తులు. శంకర శతక కర్త. పుట్టి బుద్ధెరిగిన తర్వాత వారు "జీవిత పర్యంతమూ, కాఫీ హోటల్ అంటే కూడా ఎలా ఉంటుందో తెలీకుండానే తన జీవన యాత్ర ముగించిన మహా" "నిష్టా గరిష్టులు. 'ఈ ఆధ్యాత్మిక విషయాలపై పట్టు, అనుష్టానం పై అనురక్తి, మా తండ్రిగారు పెట్టిన భిక్షే ' అని వినమ్రతతో " అంటారు శ్రీ చాగంటి వారు. మా గురువుగారి ఆరో ఏటనే పితృ వియోగం సంభవించింది. అప్పటినుండి వారి స్థానం కూడా "తనే భర్తీ చేస్తూ, నలుగురు పిల్లల యోగ క్షేమాలు నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎన్నో ఇబ్బందుల నెదుర్కొని వారిని ఈ" సమాజంలో సమున్నతమైన స్థానానికి చేర్చిన ఆ మాతృమూర్తి ప్రస్థానానికి గురువుగారే ప్రత్యక్ష సాక్షి. అమ్మ త్యాగం "ఏ స్థాయి లో ఉంటుందో సంపూర్ణంగా అనుభవించిన వారు కాబట్టే, వారు ఏ సభలలో నైనా ఏ అమ్మ గురించైనా మాట్లా" "డుతున్నప్పుడు, వారి కళ్ళే కాదు, వింటున్న వారి కళ్ళూ తడుస్తాయంటే ఆశ్చర్యమేముంది !!!"

గురుదేవులు: బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు.

"ఎవరి నామం విన్నంత మాత్రాన శ్రీ చాగంటి వారు అప్రయత్నంగా చేతులు జోడిస్తారో, ఎవరి దర్శన మాత్రాన తాను" "స్వర్ణ దండం లా నేల మీద పడి ప్రణిపాతం చేస్తారో, ఆ అమరేశ్వర ప్రసాద్ గారు, విశ్వమిత్రులు. విశ్వామిత్రులు. " "హస్త మస్తక సంయోగం చేత, తన శిష్యుడికి బాల్యంలో మంత్రోపదేశం చేయడమే కాదు… ఇన్నేళ్ళ తర్వాత ఈ రోజుకు" "కూడా, వారు చేసుకుంటున్న జప తపాదులలో భాగాన్ని మా గురువు గారి ఆయురారోగ్య అభివృధ్ధుల కోసం " "ధార పోస్తున్నారంటే, వారి త్యాగానికీ, వాత్సల్యానికీ హద్దెక్కడ !!!"

"వాచిక గురువైనా, సూచక గురువైనా, బోధక గురువైనా, పరమ గురువైనా, జగద్గురువైనా, ఏ గురువు గారి గురించి చెప్పే" "ప్పుడైనా, శ్రీ చాగంటి వారి ఉద్వేగం పతాక స్థాయిలో ఉండటానికి కారణం వారికి ఉపదేశానుగ్రహం ఒసగిన బ్రహ్మశ్రీ" మల్లంపల్లి వారే.

"తను ఆదేశిస్తే, శిష్యుడు ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా, ఉత్తర క్షణం తన ముందు వాలతాడన్న సత్యాన్ని ఎరిగి" "కూడా, ఆయన స్వయంగా శిష్యుడి దగ్గరకు వెళ్ళడానికే మొగ్గు చూపిస్తారు . శిష్యుణ్ణి కంది పోకుండా కాపాడుకోవాలన్న" "తాపత్రయానికీ, పితృ ప్రేమకూ నిలువెత్తు నిదర్శనం శ్రీ మల్లంపల్లి వారు. మా అందరికీ '' పరమ గురువులు "" ."

దైవం: అద్వైత భావన

"ఆదిశంకర భగవత్పాదుల "" అద్వైత"" భావన ను గురువుగారు పరిపూర్ణంగా జీర్ణించుకున్నారనడానికి ఎన్నో ఉదాహరణ" లున్నాయి.

ఉన్నది ఒక్కటే బ్రహ్మ పదార్ధం; మనిషికి కనిపించే నామరూపాలన్నీ కేవలం ఆ పరమాత్మ స్వరూపాలే ' అన్న ఎరుక "గనక మనసులో స్థిరపడకపోతే, పశు పక్ష్యాదులతో సహా, అందరినీ సమదృష్టితో చూడటం ఎవరికి సాధ్యం..?"

"శ్రీ రామచంద్రమూర్తి గురించైనా, శివ సంబంధమైనా, శ్రీ కృష్ణుల వారి గురించి చెప్పినా, కలియుగ దైవాన్ని కన్నుల" "ముందు సాక్షాత్కరింపజేసినా, అమ్మవారి వివిధ నామ,రూప,గౌణాలను ప్రస్తుతి చేసినా, ఒకే నిబధ్ధత.. ఒకే తాదాత్మ్యం.." "తన ప్రతిభా పాటవాల విభూతులన్నీ ఆ అద్వైత శక్తి ప్రసాదాలు మాత్రమేననీ, తాను కేవలం నిమిత్త మాత్రుడినేనన్న," "తనకు తానే అనుక్షణం చేసుకునే హెచ్చరికే, ఆ దైవాన్ని ఇక ఎటూ కదలకుండా వారి గుండె లోనే కట్టడి చేసేసింది."

"అంతే కాదు. సభానంతరం భక్తులు సమర్పించే, పూలదండలూ, పళ్ళూ, పంచెలూ మాత్రమే గురువుగారు స్వీకరించడానికి " "గల కారణం; పూలూ, పళ్ళూ గురువుగారి పట్ల భక్తి ప్రకటనకు నిదర్శనం. అంచుతోకూడి ఉన్న పంచెల చాపు ఆయు" ర్దాయాన్ని పెంపొందింపజేస్తుంది… అలాటి వాటిని తిరస్కరించకూడదన్న ధర్మసూక్ష్మానికి లోబడి మాత్రమే.

"ఒకవేళ ఏ భక్తులైనా, సమర్పించే వస్త్రద్వయం మాటున డబ్బు ఉంచితే, అది వారి దృష్టికి వచ్చిన మరు క్షణం ఏదో ఓ" "పుణ్య కార్యానికి వినిమయమైపోతుంది తప్ప, వారి స్వప్రయోజనాల ఛాయల క్కూడా చేరదు."

"నిజానికి, సమర్పింపబడిన వాటిలో సింహభాగం పంపకాల రూపంలో అర్హులైన ఇతరులకు వెళ్ళిపోవడమే తప్ప, వారి " ఇంటి సింహద్వారం దాటి లోపలికి రావడం బహు అరుదు. సాక్షాత్తూ భగవత్ స్వరూపాన్ని అన్ని ఇతర ప్రాణులలో చూడటం చేతనైన వారికి తప్ప అన్యులకు అది సాధ్యమే !!!

సహ ధర్మ చారిణి: శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరి.

"కేవలం పాణిగ్రహణ సమయంలోనే కాక, '' నాతి చరామి '' అని ఇద్దరూ ముక్త కంఠంతో అనుకుని ఇప్పటికీ పాటిస్తున్న" "మహాధ్బుత సంకల్పం, సందర్భం మరోటుంది."

సుమారు పాతికేళ్ళ క్రితం 'మాతా శివ చైతన్య ' పెద్దాపురంలో అనుగ్రహ భాషణం చేస్తూ సభికులనుద్దేశించి సంధించిన "ప్రశ్నకు సమాధానం చెప్పడానికి వేదిక పైకి నెట్టబడ్డ గురువుగారు, అటు పిమ్మట కూడా, భగవత్సంబంధమైన" "విషయాలను ప్రవచన రూపంలో ప్రపంచానికి అందించాలన్నది ఆ జగన్మాత నిర్దేశం అని అర్ధమైన మీదట, శ్రీమతి " "ప్రోద్బలంతో వారిరువురూ, ఓ సుదృఢ నిర్ణయం తీసుకున్నారు."

' ప్రవచనాలు చెప్పినందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు తీసుకోరాదు. ఏ రూపేణా ఐనా సరే.. ఎంత మొత్తమైనా సరే.!' "ఎవరి ద్వారానైనా సరే,,!!''"

కేవలం అది మాత్రమే కాదు. ధర్మబధ్ధం కాని ఆర్జన జోలికి అసలు వెళ్లనే కూడదు.

"నిజానికి వారు నిర్వర్తించవలసిన ఎన్నో కర్తవ్యాలు, ఆ సమయంలో, డబ్బుతో ముడివడి ఉన్నవే.. అయినా సరే ఇద్దరూ" "కలిసే భరించారు. బాధ్యతలు నిర్వర్తించారు గానీ, అనుకున్న మార్గం నుండి ఒక్క అడుగూ పక్కకు వేయలేదు."

"ఆ వజ్ర సంకల్పానికి సాక్షాత్తూ ఆ భగవంతుడే దిగి వచ్చి వారి అవసరాలను తానే తలకెత్తుకున్నాడు తప్ప , తనను" "అంతగా నమ్మిన భక్తులకు కించిత్ లోటు కూడా, ఏ సందర్భంలోనూ, రానివ్వలేదు."

ఎన్నో వేల మందికి కొరుకుడు పడని ప్రశ్న అది. ''డబ్బు మీద వ్యామోహం లేకుండా కలియుగంలో సాధ్యమా '' అని. ' మీ పూజ గదిలో ఉన్నది అంగుష్ఠ మాత్ర విగ్రహం కాదు. సాక్షాత్తూ భగవంతుడే అని మీరు పరిపూర్ణంగా విశ్వసించిన నాడు ఏదైనా సుసాధ్యమే '' అన్నది గురువుగారి స్వానుభవాలు చెబుతున్న అక్షర సత్యాలు.

కార్యేషు దాసీ; కరణేషు మంత్రీ; భోజ్యేషు మాతా; రూపేచ లక్ష్మీ; శయనేషు రంభా; క్షమయా ధరిత్రీ; షట్కర్మ యుక్తా "సహ ధర్మ పత్నీ: అనే సనాతన పత్నీ ధర్మానికి ప్రతి రూపం కనుకనే, ఆమె పట్ల అందరికీ అంత గౌరవం.. భక్తి." అర్ధ నారీశ్వర స్వరూపానికి నిలువెత్తు నిదర్శనాలు ఆ దంపతులు.

"తనూభవులు: షణ్ముఖ చరణ్, నాగ శ్రీ వల్లి"

పట్టభద్రులైన పిల్లలిద్దరూ కూడా గురువుగారి కీర్తి ప్రతిష్టలను పెంపొందించే వారుగానే ఎదగడం ఆ ఈశ్వరుడి కృప.

"షణ్ముఖ చరణుడు,"
"తన మొదటి వేతనం లో నుండి తన తాత గారి ' శంకర శతకం ' శ్లోకాలూ, పద్యాలనూ ఓ గ్రంధ రూపం లోనికి తీసు" "కొచ్చి, ఆ గ్రంధాన్ని కాశీ మహా క్షేత్రం లో తన తండ్రి గారి చేత ఆవిష్కరింపజేయడం ఒకెత్తయితే, ఎంత పని ఒత్తిడి లో" "ఉన్నా, తన తండ్రి గారి అనుష్టానానికి ఏ మాత్రమూ తగ్గకుండా, తన అనుష్టానాన్ని రూపొందించుకుని, ఆచరించడం," పుత్ర ధర్మాన్ని తుచ తప్పకుండా నిర్వర్తించడం మరో కోణం.

"నాగ శ్రీ వల్లి,"
"తన తండ్రి గారి లా, ఆది శంకర భగవత్పాదుల మీద సుస్థిరమైన భక్తి ప్రపత్తులు పెంచుకోవడం ఒకెత్తయితే, మరో " "పక్క నాయనమ్మ స్ఫూర్తితో ,, శస్త్ర చికిత్సను తిరస్కరించి, ప్రసవ వేదనను పూర్తిగా భరించి, కవల పిల్లలకు జన్మ" "నివ్వడం, అమ్మతనం యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టడం ఇంకో ఎత్తు."

"సుమారు ఐదు సంవత్సరాల క్రితం "" రాయవరపు "" వారితో వియ్యమందుకున్న గురువుగారికి అల్లుడు, ""వంశీ "" అన్నా," "దగ్గర దగ్గరగా ఏణ్ణర్ధం క్రితం ' కల్వకుంట' వారింటి నుండి, తమ ఇంటికొచ్చిన కోడలు, మహా లక్ష్మీ స్వరూప, చిరంజీవి " "సౌభాగ్యవతి 'దివ్య సుమన ' అన్నా, ఎంతో వాత్సల్యం."

"మూడు సంవత్సరాలు నిండిన కవలలు; దౌహిత్రులు ' కార్తికేయు ' డన్నా, మనవరాలు ' శ్రీకరి ' అన్నా ఎంతో ముద్దు."

"హైదరాబాద్ లో స్థిరపడిన కొడుకు ఇంటికి తరచూ వెళ్ళివస్తున్నా, అది ఆధ్యాత్మిక ప్రస్థానంలో ఓ మజిలీ యే తప్ప," "లౌకికమైన బంధమై, గురువుగారి దంపతులను ఆపగలిగే గమ్యం మాత్రం కాదు."

అసాధారణ ధారణాశక్తి:

"వారి శిష్యుల్ని అనేక మంది అడుగుతూ ఉంటారు. "" ఇన్నిన్ని శ్లోకాలూ, ఆధ్యాత్మిక విషయాలూ, నామాలూ వారికి" "ఎలా గుర్తుంటాయి ?? సుమారు రెండు గంటల పాటు మంచినీరు కూడా తీసుకోకుండా అనర్గళంగా, తడబడకుండా" శాస్త్ర విషయాలను ఉటంకించడం వెనక రహస్యమేమిటి?? అంతంత సుదీర్ఘమైన వాక్య నిర్మాణ కౌశలం వారికి ఎక్కడి నుండి అబ్బింది??

"గురువుగారి సమాధానం ఒక్కటే. "" అంతా అమ్మ వారి దయ. నా గొప్పతనం ఏం లేదు. వాక్యం వెనక వాక్యం ప్రచోద" "నం చేస్తున్నది అమ్మవారే. నా ముందు ఉన్న మైక్ ఎంత అస్వతంత్రమో, నేనూ అంతే. """

"వినేవారికి వింతగా ఉన్నా, అది మాత్రం సూనృతమేనన్న సంగతి మా కందరికీ తెలిసిందే. అంతే కాదు. గురువు గారు" "సంకల్పించిన సభలకూ, క్రతువులకూ, ప్రకృతి ఏ నాడూ ప్రతిబంధకం కల్పించడం జరగలేదు అన్న విషయం, మాతో" పాటు వాటిలో పాల్గొన్న అనేక మంది భక్తులకూ అనుభవైకవేద్యమే.

"తర్కానికీ, ఆధునిక శాస్త్ర్రానికీ అంతు పట్టని ఈ ప్రక్రియ వెనక ఓ అదృశ్య శక్తి ఉన్నదన్నది అందరూ ఒప్పుకోవలసిన" పరమ సత్యం.

"అయితే, కేవలం ఒక్క గురువుగారి ప్రవచనాలు, ఆధ్యాత్మిక విషయాలలో మాత్రమే ఎందుకిలా జరుగుతోందంటే," "అది ఆయన అనుష్టాన బలం, ధర్మాచరణ పట్ల ఆయనకున్న విశేషమైన అనురక్తి."

"శాస్త్ర్రం విధించిన విధి, నిషేధాల విషయంలో వారు సదా అప్రమత్తులు. అక్కడ మాత్రం రాజీ అనే మాటే లేదు." మినహాయింపుల ప్రసక్తే రాదు.

"ఈ ఆచరణ వారు ఓ తపస్సులా నిర్వహించడానికి తగిన శక్తి సామర్ధ్యాలను, తగిన వాతావరణాన్ని కల్పిస్తున్నది" "మాత్రం, వారి అర్ధాంగి, అస్మద్గురు పత్ని, పార్వతీ మాతకు ప్రతి రూపం, శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరి గారే…"

"శారీరికంగా, ఓ కాలు సహకరించకపోయినా, తన కర్తవ్య నిర్వహణలో ఎన్నడూ తడబడలేదా తల్లి.."

"అలాంటి పుణ్య దంపతులను ఆదర్శంగా తీసుకుని మనమూ ఎంతోకొంత ఆచరణ మొదలు పెడితే, అది లేశమైనా," "ఓ పాశమై, భగవంతుడి వైపు లాగుతుంది."

"అంతే గానీ, అందరినీ నెట్టుకుని, బలవంతాన వారికి పాద నమస్కారం పేరున వారి పధానికి అడ్డుపడిపోయి, వారిని" "స్పృశించినంత మాత్రాన, మన పాపాలు ప్రక్షాళనమైపోయి, భగవంతుడు మనకు ప్రసన్నుడౌతాడా??"

ఇది ఎవరికి వారు వేసుకోవలసిన ప్రశ్న… ఎవరూ చెప్పక్కర్లేని జవాబు కూడా దాంట్లోనే ఉంది…

కేవలం స్పర్శ మాత్రాన వారిలోని శక్తి మనలోకి ప్రవహించడానికి అది లౌకికమైన విద్యుత్తు కాదు. "దశాబ్దాల తరబడి అకుంఠిత దీక్ష, కఠోర శ్రమలతో, క్రమం తప్పని ఆచరణతో, భగవద్దత్తమైన విద్వత్తు."

"సూర్యభగవానుడిలోని వేడిమీ,"
"భూమాతలోని ఓరిమీ,"
"ఈశ్వరుడి లోని కూరిమీ,"

"ఎలా అంచనాలకు అందవో, అదీ, అంతే. "
అది ఓ అక్షయ పాత్ర. అమృత పాత్ర. చెవులతో జుర్రుకున్నవాడికి జుర్రుకున్నంత.
ఆచరణలోకి తెచ్చుకున్నవారికి తెచ్చుకున్నంత…

శ్రీ రామచంద్ర మూర్తి [శ్రీ రామాయణం లో ] చేసినట్టు చెయ్యండి.
శ్రీ కృష్ణ పరమాత్మ [ భగవద్గీత లో ] చెప్పినట్టు చెయ్యండి.

"ఇది, శిష్టాచారాన్ని ఔపోసన పట్టిన పెద్దలు మనకు చెప్పిన మాట."

గురువుగారు అలానే చేస్తున్నారు. చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవా అని ఊరికే అన్నారా పెద్దలు !!!..!

"గురువు గారి పాదాలకు నమస్కరిస్తూ,"
వారి శిష్య బృందం తరపున
వేములపల్లి మోహన్ రావు.

couple

చాగంటి దంపతులు

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి దంపతుల దివ్య ఆశీర్వచనములతో ఈ వెబ్ సైటు లో మీకు ఎప్పటికప్పుడు అన్ని రకముల ఆథ్యాత్మిక అమృత ప్రవచనములను, పూజ/భక్తికి సంబంధించిన వివరములను, అనేకమైనటువంటి ఆసక్తికరమైన విశేషములను మీకు అందజేయాలని సంకల్పిస్తూ మా ఈ యజ్ఞాన్ని సహృదయముతో ఆదరిస్తూ ఆశీర్వదించమని సదా మిమ్ములను కోరుకుంటూ...
సదా మీ సేవలో
శ్రీచాగంటి.నెట్